calender_icon.png 4 February, 2026 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్నెళ్లలో కాంగ్రెస్‌లో కొట్లాటలు తథ్యం

04-02-2026 01:59:53 AM

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రానున్న ఆరు నెలల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పా ర్టీలో మంత్రులు, నాయకులు మధ్య కొట్లాటలు కావడం తథ్యం అని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని 28, 20 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు కుర్ర తిరుపతి, ఏదుల్ల రాజశేఖర్ కు మద్దతుగా జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ లతో కలిసి వినోద్ కుమార్ ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. కేంద్రంతో కొట్లాడి మేము ని ధులు తెచ్చామని మరి మీరేం తెచ్చారని వినోద్‌కుమార్, బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు.