15 May, 2026 | 11:36 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

నామినేషన్ పత్రాల చోరీ

04-12-2025 12:02 AM
  1. పంచాయతీ తాళం పగలగొట్టి అపహరణ.. 

విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్, డీఎస్పీ

తాండూరు, డిసెంబర్3 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్‌పత్రాలు చోరికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన  వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు.

సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఎన్నికల అధికారులు గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలోనే భద్రపరిచారు. అయితే బుధ వారం ఉదయం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం చేసి కార్యాలయంలో ఉన్న సర్పంచ్,  మరియు వార్డ్ అభ్యర్థుల నామినేన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.

వెంటనే తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల నామినేష్లు చోరికి గురి కావడం కలకలం రేపుతోంది. ఈ సఘటనపై అధికారులు విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.