15 May, 2026 | 12:18 PM

మైనర్ బాలికపై లైంగిక దాడి..

15-05-2026 10:51 AM

పోలీసుల అదుపులో నిందితుడు. 

ఇలాంటోళ్లను ఎన్కౌంటర్ చేయాలి.. బిజెపి నాయకులు. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) యాలాల మండలంలో దారుణం జరిగింది. శుభం తెలియని ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎస్సై విట్టల్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఓ గ్రామంలో తల్లితో కలిసి మైనర్ బాలిక(14) నివసిస్తుంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద  ఉంటున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన షేక్ ఫరన్ S/o బషీర్  అనే యువకుడు బాలిక ఒంటరిగా ఉందని తెలుసుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో సెల్ ఫోన్ చార్జర్, త్రాగునీరు నీళ్లు కావాలని సాకుతో ఇంట్లోకి చొరబడి అమ్మాయిపై  లైంగిక దాడి చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్సై విటల్ రెడ్డి విచారణ జరిపి  ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్ర బిజెపి నాయకురాలు, మున్సిపల్ కౌన్సిలర్ సాహూ శ్రీలత డిమాండ్ చేశారు.