8 August, 2026 | 6:24 PM

ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం

08-08-2026 05:22 PM

జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ 

చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరికి ఇది చివరి అవకాశం అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూరించిన ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడానికి ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. మూడు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉందని, ఎవరైతే ఓటర్లు ఇంకా తమ ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదో బూత్ లెవల్ అధికారిని సంప్రదించి పూరించిన ఫారాన్ని డిజిటలైజేషన్ కొరకు సమర్పించాలని సూచించారు.

ఆగస్టు 10 లోగా ఫారం సమర్పించని పక్షంలో ఆగస్టు 17, 2026న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో  పేరు నమోదు కాదని తెలిపారు. ఓటర్లు తమ ఫారాన్ని సులభంగా ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు. అందుకోసం ceotelangana.nic.in లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్ మొబైల్ యాప్ ECINet యాప్ లేదా సహాయం కోసం ఉచిత ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950 మరిన్ని వివరాల కోసం మీ సంబంధిత బూతు స్థాయి అధికారులకు ను సంప్రదించాలని సూచించారు.