చందానగర్ జువెల్లర్స్ షాప్‌లో చోరీ
03-08-2026 12:00 AM
- బంగారు ఆభరణాలు అపహరణ
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (విజయక్రాంతి): చందానగర్ ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపంలో ఉన్న ఒక బంగారం దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. శనివారం ఉదయం దుకాణం తెరి చిన యజమాని లోపలి స్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. వస్తువులు అటూ ఇ టూ చెదిరి ఉండటంతో పాటు విలువైన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే చందానగర్ పోలీస్ స్టేష న్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని ద ర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.






