2 April, 2026 | 2:20 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులతో బందోబస్తు   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •  

యువత బెట్టింగ్‌కు దూరం ఉండాలి

02-04-2026 01:21 AM

జహీరాబాద్, ఏప్రిల్ 1: యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్, ఝరాసంగం, హద్నూరు, కో హిర్, చిరాకుపల్లి ఎస్‌ఐ లు కాశీనాథ్ పటేల్, క్రాంతి కుమార్, దోమ సుజిత్, టి నరేష్, రాజేందర్ రెడ్డి లు వేరువేరుగా యువతకు సూచించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోయి అప్పుల పాలవుతారని తెలిపారు. తల్లిదండ్రులు సంపాదించిన సంపదను క్షణకాలంలోనే బెట్టింగ్ లో కోల్పోతారని, తద్వా రా బెట్టింగ్ ఆడిన వారు జీవితాన్ని కోల్పోతారని వారు తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ఆడ డం చట్టరీత్యా నేరమని, యువత, విద్యార్థు లు తెలుసుకోవాలని వారు వివరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్న వారి సమాచారాన్ని అందించినట్లయితే వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. యువత చెడు మార్గమున నడవకుండా మంచి మార్గంలో నడిచి పేరు ప్రా ఖ్యాతలు సంపాదించాలని వారు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని వారు పేర్కొన్నారు.