17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రపంచమే హద్దుగా రాష్ట్ర అగ్రి చాప్టర్ ఉండాలి

30-11-2025 12:00 AM

గ్లోబల్ సమ్మిట్‌లో ‘విజన్ 2047’ఆవిష్కరణకు కసరత్తు

అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచనలు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయి కి తీసుకెళ్లే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ- 2047 అగ్రి చాప్టర్ ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు. డిసెంబర్ నెలలో నిర్వ హించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘విజన్ డా క్యుమెంట్ 2047’ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది.

ఈ విజన్ డాక్యుమెంట్‌లో కీలక భా గంగా రూపొందుతున్న ‘తెలంగాణ వ్యవసాయ - 2047 అగ్రిచాప్టర్’ భవిష్యత్ వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయనుంది. తుది నివేదికపై చర్చించడా నికి శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖల ఉన్నతా ధికారులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో వ్యవసాయరంగం అభివృద్ధి చెందాలని అన్నారు.

రైతు కేంద్రీకృత ప్రణాళికలు, రైతుఆదాయం పెంపు, ఉత్పాదకతలో నాణ్యతా ప్రాముఖ్యత, సాగు లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలను చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు పండించే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ జోడించే అగ్రి-ప్రాసెసింగ్ వ్యవ స్థలను విస్తృతంగా అభివృద్ధి చేయడం అత్యం త కీలకమని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచస్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గ్లోబ ల్ సీడ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జానయ్య, ఉ ద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.