12 June, 2026 | 1:42 AM

పటిష్ట ప్రణాళికతో మహిళా డెయిరీని విజయవంతం చేయాలి

12-06-2026 12:35 AM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

హనుమకొండ, జూన్ 11(విజయ క్రాం తి): పటిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణతో పరకాల మహిళా డెయిరీని విజయ వంతంగా ముందుకు తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో పరకాల మహిళా డెయిరీ పనుల పురోగతి, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూ హాలపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ప్రస్తుతం మార్కె ట్లో ఉన్న వివిధ పాల బ్రాండ్ల విక్రయాలు, వినియోగదారుల అభిరుచులు, పోటీ పరిస్థితులు, పరకాల మహిళా డెయిరీ ద్వారా మా ర్కెట్లోకి తీసుకురానున్న పాల ఉత్పత్తుల మా ర్కెటింగ్ విధానాలపై విస్తృతంగా చర్చించా రు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ డెయి రీ ఒక ఆదర్శవంతమైన వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ పరకాల మహిళా డెయిరీని గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పాల సేకరణ, ఉత్పత్తి, నా ణ్యత, మార్కెటింగ్ అనే నాలుగు అంశాలు డెయిరీ విజయానికి కీలకమని పేర్కొన్నారు. డెయిరీ ద్వారా మహిళలకు స్థిరమైన ఆదా యం లభించడంతో పాటు, సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా ముఖ్యమని అన్నారు. పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రిటైలర్లు, మిల్క్ పార్లర్ల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రెండు లీటర్లకు పైగా పాలు సరఫరా చేసే రైతులు, ఒక లీటర్ కంటే తక్కువ పాలు సరఫరా చేసే రైతుల వివరాలను వర్గీకరించి సమగ్ర డేటా సిద్ధం చేయాలని అధికారులకు సూచించా రు.

డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులకు వారం లేదా పది రోజుల వ్యవధిలోనే చెల్లింపులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రైతుల విశ్వాసమే డెయి రీకి బలమని పేర్కొన్నారు. మొదటి దశలో పాల ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి సారిస్తున్నామని, నాణ్యత విషయంలో ఎలాంటి రా జీ లేకుండా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అన్నారు. మార్కెట్లో పోటీ ని తట్టుకునేలా సమర్థవంతమైన బ్రాండింగ్, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

పరకాల మహిళా డెయిరీ నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతను పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మెప్మా పీడీ రాజేశ్వర్రావు, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత, ఏపీఎం దివాకర్రాయ్, మహిళా డెయిరీ జనరల్ మేనేజర్ కృష్ణ, మెప్మా డీఎంసీలు రజిత రాణి, రేణుక, టీఎంసీలు వెంకట్రెడ్డి, రమేష్, సీవోలు తదితరులు పాల్గొన్నారు.