12 June, 2026 | 1:41 AM

అప్పుల పాలు కావద్దనుకుంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి

12-06-2026 12:36 AM

నాగిరెడ్డిపేట్, జూన్ 11 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ‘ప్రొఫెసర్ జయశంకర్‘బడి బాట‘కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో పాటు పాలకవర్గం సభ్యులతో ర్యాలీ నిర్వహించారు.

గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు.ప్రైవేటు పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మన కుటుంబాలు అప్పుల పాలు అవుతాయని వివరించారు.కుటుంబాలు అప్పుల పాలు కావద్దనుకుంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మెరుగైన విద్య బోధన అందిస్తారని, నాణ్యమైన భోజనం,ఉచిత పుస్తకాలు,ఉచిత యూనిఫాం తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ జయరాజ్, కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు జ్యోతి, వార్డుసభ్యులు సాయిబాబా, లాలు, హేమలత, గ్రామస్తులు పాల్గొన్నారు.