28 February, 2026 | 7:55 PM

మూడో కల్లు సొసైటీలో రూ. కోట్ల గోల్‌మాల్

28-02-2026 02:18 AM

ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ

‘విజయక్రాంతి’ వరుస కథనాలకు స్పందన

బయటపడనున్న మూడవ కళ్ళు సొసైటీ బాగోతం 

నిజామాబాద్ ఫిబ్రవరి 27:(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో (పట్టణ మూడవ గౌడ సంఘం) భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని ఈ విషయమై సొసైటీ సభ్యులు సొసైటీ పై ఆధారపడిన కుటుంబాల పక్షాన విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురించింది.

బాధిత కుటుంబాలు సొసైటీ సభ్యులకు అండగా నిలిచింది. వార్తా కథనాల కు స్పందించిన జిల్లా అధికారులు,సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు స్పందించి  విచారణ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్రిసభ్య కమిటీ విచారణలో కమిటీ లో జరిగిన నిధుల గోల్మాల్ అవినీతి అక్రమాలు బట్టబయలు ఉన్నాయి. మూడవ కళ్ళు సొసైటీ నిధులను ఓకే కుటుంబం కా చేసిందని గీతా కార్మికులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. గౌడ కులస్తులు ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంచారు.

ఈ సందర్భంగా గీతా కార్మికులు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి రెండు సొసైటీలు రద్దు కావడంతో మూడో సొసైటీని మంజూరు చేయడం జరిగింది సొసైటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఈ సొసైటీ పై ఆధారపడి బతుకుతున్నటువంటి 200 గౌడ కుటుంబాలకు జీవనాధారంగా ఉంటుందని భావిస్తూ మంజూరు చేయడం జరిగింది కానీ ఒకే కుటుంబం తమ సొంత జాగిర్ గా భావిస్తూ 55 మంది సొసైటీ సభ్యులలో ఓ కుటుంబం ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ కల్లు వ్యాపారం లో అనేక అక్రమాలకు పాల్పడుతూ మూడవ గౌడ సంఘం రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు.

ఈ కుటుంబం జరిరిపిన అక్రమాలపై ప్రశ్నిస్తున్న కార్మికులను సొసైటీ నుండి అక్రమంగా తొలగించారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో పేద కార్మికుల ను భయభ్రాంతులకు గురి చేస్తూ సొసైటీ నియమాల కు అనుగుణంగా  స్థానికంగా లేనటువంటి ఇతర జిల్లాలకు చెందిన ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తుల ను ఈ సొసైటీలోలు సభ్యులుగా కొనసాగిస్తున్న వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి కి ప్రజావాణిలో సొసైటీ సభ్యులు అందజేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియామిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నూతనంగా ఏర్పడిన విచారణ కమిటీ కమిటీ సమగ్రంగా విచారణ జరిపి కొద్ది రోజుల్లోనే  అన్ని విషయాలు తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు రాజా గౌడ్ యాద గౌడ్ మల్ల గౌడ్ రామా గౌడ్ శంకర్ గౌడ్ కాటమయ్య గౌడ్ కొండ గౌడ్ సూరిబాబు గౌడ్ రాజు గౌడ్ , గౌడ సంఘం సభ్యులు సిరియాల స్వామి గౌడ్, బిక్షపతి గౌడ్ సురేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నవీన్ గౌడ్ ప్రేమ్చంద్ గౌడ్ అశోక్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.