28 April, 2026 | 7:51 AM

ఫెర్టిలైజర్,పెస్టిసైడ్స్, సీడ్స్, డిస్ట్రిబ్యూటర్ల, డీలర్ల బంద్ విజయవంతం

28-04-2026 01:58 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 27(విజయక్రాంతి):  రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందులు మరియు సీడ్స్ షాపులు ఒక్కరోజ బంద్ చేయలని రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు, కరీంనగర్ జిల్లా మరియు మండలాల అసోసియేషన్లు సోమవారం రోజున సంపూర్ణ బంద్ పాటించడం జరిగింది.

అందరు ఏకగ్రీవంగా  ఎరువుల ఎఫ్‌ఓఎల్ పద్ధతిలో సరఫరా,లింక్ ప్రొడక్ట్లు లేకుండా ఎరువులను కంపెనీలు ఇవ్వాలని,మరియు హెచ్ డి కాటన్ పై, సీడ్స్ మరియు పురుగుమందుల పైన అందరము చర్చించి చట్టబద్ధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధముగా మరియు రైతులకు అందుబాటులో ఉండేలా తదితర విషయాల పైన కఠినంగా వుంటామని నిర్ణయించి బంద్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పి. రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జి. జలేందర్, ట్రేసరర్ కె. జగన్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.