ఎస్‌ఐఆర్ సజావుగా నిర్వహించాలి
శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్
శంకర్‌పల్లి; జూలై 7 (విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు, బి ఎల్ ఓ సూపర్వైజర్లతో మంగళవారం శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఈ ఆర్ ఓ, శంకర్ పల్లి తాసిల్దార్ సురేందర్ క్రింది సూచనలు జారీ చేశారు.
ఓటర్ల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు గ్రామస్థాయి లో ప్రతిరోజు మేళలు నిర్వహించాలని తెలిపారు. గ్రామస్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని శాఖలకు చెందిన అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ ఈ కార్యక్రమాలలో పాల్గొని, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సర్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహకారా న్ని అందించాలన్నారు. పై సూచనలను సంబంధిత వారందరూ ఖచ్చితంగా పాటించాలని తహసిల్దార్ ఆదేశించారు. ఈ కార్య క్రమంలో ఎంపీ ఓ గిరిరాజు, ఏపీవో నాగభూషణం అధికారులు పాల్గొన్నారు.






