12 August, 2026 | 9:19 AM

Breaking News

దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి   •   సీజనల్ వ్యాధుల వైద్యుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడేగం సర్పంచ్   •   లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం   •   ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి శ్రీధర్‌ రావు నియామకం   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేడీ ఆకస్మిక సందర్శన   •   ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!   •   బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి   •   మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం   •  

వృద్ధురాలు అదృశ్యం

12-08-2026 12:57 AM

మేడిపల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి); మతిస్థిమితం సరిగా లేని వృద్దురాలు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్ల, ద్వారక నగర్ పేస్ - 2, అమ్మ ఆసరా వృద్ధ ఆశ్రమం లో ఉండే లక్ష్మమ్మ  (70 ) మతి స్తిమితం సరిగా లేదు, గత నెల 15 తేదీన  సయోధ్య షెల్టర్ హోం, మేడ్చల్ నుండి అమ్మ ఆసరా వృద్ధ ఆశ్రమం చెంగిచెర్ల కు పంపించడం జరిగింది.

ఈనెల10.న ఉదయం 06.30 గంటల సమయంలో వృద్దు రాలు ఆశ్రమం నుండి బయటి వెళ్లి  తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు అని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామని, వృద్ధురాలి ఆచూకి తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు.