22 April, 2026 | 2:31 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

ఓటు చోర్‌పై సంతకాల సేకరణను విజయవంతం చేయాలి

10-10-2025 12:00 AM

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

నల్లగొండ టౌన్ అక్టోబర్ 9 : బిజెపి చేస్తున్న ఓటు చోర్ సంతకాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో ఓట్ చోర్ పై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంతకాల సేకరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బిజెపి ఓట్ చోర్ తో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు.మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓట్ చోర్ కు పాల్పడిందని ఆరోపించారు రాత్రికి రాత్రి 60 లక్షల ఓట్లు నమోదు చేసిందని,. దీనిని నిరసిస్తూ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగిందని గుర్తు చేశారురాహుల్ గాంధీ పిలుపుమేరకు టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టిపిసిసిజిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో ఓట్ చోరిపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ప్రతి గ్రామంలో 100కు పైగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్ కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మనిమద్దె సుమన్, పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు