calender_icon.png 9 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లుగా గోస

09-02-2026 01:29:04 AM

హామీలతో మోసం చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్

  1. ప్రచారానికి వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీయండి 
  2. మున్సిపల్ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి 
  3. నర్సంపేట, వర్ధన్నపేట, తాండూరు ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నర్సంపేట (మహబూబాబాద్)/తాండూరు, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోసపడుతున్నామని, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, తప్పుడు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని నర్సం పేట, వర్ధన్నపేట, వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ మాట్లాడారు.

నర్సంపేట అంటేనే పోరాటల గడ్డ ఉద్యమాల అడ్డా అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి నర్సంపేట నాంది కావాలన్నారు. ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నామని, హామీల పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేసిందన్నారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన ఇప్పటివరకు ఒక్కరికి ఇవ్వలేదన్నారు. 4వేల పెన్షన్ ఇస్తాన్నన్నారు.. రాలేదని, రంజాన్ తోఫా రాలేదని, సకాలంలో రైతులకు యూరి యా రాలేదని, డిసెంబర్ లో ఇవ్వవలసిన రైతుబందు ఫిబ్రవరి వచ్చినా రాలేదన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని దొంగ హామిలేనని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలకు మోసపోయాం.. మరోసారి వారి మాటలను నమ్మకుండా కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని గులా బీ జెండా ఎగురవేద్దామని అన్నారు.

మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తూ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. తాండూర్‌కు బీఆర్‌ఎస్ హయాంలోనే నర్సింగ్ కళాశాలను మంజూరు చేయగా సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా రెండేళ్లుగా మాయమాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్పిస్తే ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కేటీఆర్ కోరారు.