26 May, 2026 | 6:29 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది

01-04-2026 12:00 AM

కొల్లాపూర్ రూరల్, మార్చి 31: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కట్టా ఉమాశంకర్ గౌడ్ అనారోగ్యంతో చికిత్స అనంతరం స్వగ్రామం సాతాపూర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి రేసోజు సురేష్ కుమార్, తలూక అధ్యక్షుడు మాలె రాజేందర్ గౌడ్, కార్యదర్శి బొల్గాం వెంకటస్వామి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టులందరూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.