18 July, 2026 | 1:25 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

గొంతు స్వరాల నాదం

06-04-2026 02:05 AM

మనసు మౌనాన్ని మాటగా మలిచే

మాయాద్వారం గొంతు

నిశ్శబ్దపు లోతుల్లో

ముద్దాడిన భావాలు ఇక్కడే స్వరాలై

ప్రపంచాన్ని తాకుతాయి !


అమ్మప్రేమలోని మాధుర్యం

ఇక్కడి నుంచే ఆవిర్భవిస్తుంది

నాన్న పలుకుల్లోని గాంభీర్యం

ఇక్కడి నుంచే ప్రతిధ్వనిస్తుంది


పాట పుడితే

గొంతు గంగలా పారుతుంది

వేదన చెందితే!

గాలి సైతం గడ్డకడుతుంది


ఆ గొంతు

ప్రేమను పలుకగలదు

పోరాటాన్ని రగిలించగలదు

ప్రార్థనగా మోగగలదు


గొంతు

శబ్దానికి మార్గం

ఆత్మకు అద్దం

అభిప్రాయానికి ఆయుధం

గొంతు - స్వరాల గర్భగుడి

మనిషి గుండె చప్పుడు

సరిగమలుగా వెలువడే ఊట చెలిమె ! 

 కొలిపాక శ్రీనివాస్