18 July, 2026 | 1:01 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

మారణహోమం

06-04-2026 02:03 AM

యుద్ధం శూన్యమై ప్రశ్నిస్తుంది

మళ్లీ ఎక్కడి నుంచి తెచ్చి 

ఈ వెలితి నింపుతావని?

కోట్ల సంవత్సరాలు ప్రేమ పునాదులతో 

పెనువేసుకున్న పంటలు 

యుద్ధంలో బూడిదై వెక్కిరిస్తున్నాయి

తలలు తెగి మొండేలను వెతుకుతున్నవి

రక్తం వరదలై పారి దేహాలను వెతుకుతున్నది

ప్రాణాలు భయపడి దేహం విడిచి 

గగనమెక్కి దుఃఖిస్తున్నవి

ఎంతకూ వీడని ప్రేమ బంధాలు 

కంటి కొసల నుంచి ద్రవిస్తున్నవి

యుద్ధం దుఃఖాన్ని తప్ప 

సంతోషాలను ఎప్పటికీ పండించలేదు !

ఇస్తారి