ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ, మార్చి 6 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ ఛైర్పర్సన్ విజయ కాసులవార్, వైస్ ఛైర్పర్సన్ రేష్మా బేగం, కౌన్సిలర్లు, ప్రజా ప్రజా ప్రతినిధులు మెప్మ అర్పిలతో కలిసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు,మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
బీబీపేటలో ప్రతిజ్ఞ..
బీబీపేట, మార్చి 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా బిబిపెట్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీవో అబ్బా గౌడ్, సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులకు పరిశుభ్రత, అభివృద్ధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ లక్ష్మీ రవీందర్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
భిక్కనూరులో..
భిక్కనూరు, మార్చి 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిసరాలను శుభ్రం చేశారు. పంచాయతీ ఈఓ పాత లక్ష్మి, సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు.




