సమస్యల సుడిగుండంలో కుబీర్ సంత
కుభీర్, మార్చి ౭ (విజయక్రాంతి) : మండల కేంద్రం కుబీర్ లో ప్రతి గురువారం సంత నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా ఈ సంత ప్రాధాన్యం కలిగి ఉంది. మండలంలోని 42 జిపిలకు సంబంధించిన 78 గ్రా మాల ప్రజలు గురువారం జరిగేది సంతకు వేలాదిగా వస్తుంటారు.
నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలు ఇతరత్రా సామా న్లు సరుకులు కొనుగోలు చేయడంతో పాటు తాము పండించిన కూరగాయలు, పప్పులు, ఉల్లి, ఎల్లిగడ్డలు, చేపలు ఇలా వివి ధ రకాల సామాగ్రి వస్తువులు విక్రయించేందుకు రైతులు వస్తారు. ఈ సంతలో జనాల కు ఎలాంటి సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవు. నీడ లేదు, వస్తువులు విక్రయిం చేందుకు ప్లాట్ఫారంలు లేవు, తాగునీటి వస తి, టాయిలెట్స్ ఇవేవీ సంతలో కానరావు. ముధో నియోజకవర్గంలో బైంసా పట్టణంలో సోమవారం జరిగే సంత తర్వాత కుబీర్ లో ప్రతి గురువారం జరిగే సంత రెండవది.
గ్రామపంచాయతీ అధికారులు క్రేవికరాలకు సంబంధించి వ్యాపారుల వద్ద రైతుల వద్ద పన్ను వసూలు చేస్తున్నప్పటికీ సౌకర్యాలు లేక సంతకు వచ్చే ప్రజలు సతమతమవుతున్నారు. కుబీర్‌లోని బస్టాండ్ సమీపం నుం డి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగే ఈ సంత ఇరుకు రహదారిలో ఇరువైపులా దుకాణా లు ఉండడంతో బస్సులు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇక ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇక జనాలు ఎక్కడి వారు అక్కడ గంటల తరబడి ఉండిపోవాల్సిందే. ఇది ప్రతి గురువారం సంతలో మామూలు అయిపోయింది. ఇంత జరుగుతున్న పాలకులు గానీ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై సంతకు వచ్చే మండ ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సం తలో సకల సౌకర్యాలతో పాటు వాహనాలు వెళ్లేలా వ్యాపారులను రోడ్డుకు దూరంగా విక్రాలు జరుపుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.




