గత ప్రభుత్వం విద్యావ్యవస్థలను పట్టించుకోలే..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్, మే 12 (విజయ క్రాంతి) : గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్సలు పట్టించుకోలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని పురాతన ఎంబీసీ జూనియర్ కళాశాలలో ముడా ని ధుల రూ 18 లక్షలతో నిర్మించనున్న టాయిలెట్ నిర్మాణానికి శంకుస్థాపన, హన్వాడ మండలం కొత్తపేట గ్రామం ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యాసంస్థల లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, విద్యావ్యవస్థను నిర్విర్యం చేసిందని ఆరోపించారు. ఈ విద్యాసంస్థ ద్వారా ఎం తో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కళాశాల నుంచి మరెంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం కళాశాల తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. కళాశాలలో ఉన్న వసతులను సౌకర్యాలను, కోర్సుల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ పీకే తిమోతి, నాయకులు చిన్న రాజు, టైటర్ రాజేందర్, సామెల్ దాసరి, ఎంబీసీ చర్చ్ ఉపాధ్యక్షులు జాకబ్ డేవిడ్ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.






