నారాయణ విద్యార్థుల ప్రభంజనం
ఎప్‌సెట్ ఫలితాల్లో టాప్ 10లో ర్యాంకులు
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ఎప్‌సెట్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ 10 లోపు 5, 100 లోపు 51 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ విభాగాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులతో ఆధిపత్యం కొనసాగించారు. స్టేట్ 2, 5, 6, 7, 8 వంటి అత్యుత్తమ ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ 2వ ర్యాంక్ బి. అన్షుల్, ఆదులు సాయినిఖిత్ 5వ ర్యాంకు, మల్లవరపు ఆస్నా 6 వ ర్యాంకు, వివాన్ శరధ్ మహేశ్వరి 7 వ ర్యాం కు, తాళ్ళూరి శ్రేయాస్‌రెడ్డి 8వ ర్యాంకు సాధించారు. అలాగే 11, 14, 15, 19, 21, 26, 27, 30, 31, 33, 38, 40, 41, 43, 44, 45, 47, 48, 54, 55, 56, 57, 57, 63, 65, 65, 67, 69, 70, 73, 75, 75, 76, 80, 82, 82, 83, 85, 87, 88, 89, 90, 97, 97, 98, 100 వంటి 100 లో 51 ర్యాంకులు వంటి టాప్ 100 లో 50 ర్యాం కులు నారాయణ విద్యార్థులే చేజిక్కించుకున్నారు. మొత్తంగా 10 లోపు 5, 100 లోపు 51, 500 లోపు 242, 1000 లోపు 439 ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డా పి. సింధూ ర నారాయణ, పి. శరణి నారాయణ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డా సింధూర నారాయణ మాట్లాడు తూ.. గత 47 సంవత్సరాలుగా కేవలం టాప్ ర్యాంకులను పరమావధిగా చేసుకుని రూ పొందించిన నారాయణ విశిష్ట విద్యాప్రణాళిక ద్వారానే ఈ ఘనవిజయాలను సాధించ గలిగామని తెలియజేశారు. డైరెక్టర్ పి.శరణి నారాయణ మాట్లాడుతూ టాప్ ర్యాంకులు సాధించిన వారికి అత్యధిక సంఖ్యలో నారాయణ స్కూల్స్లో చదివిన విద్యార్థులే ఉన్నారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలియజేశారు.






