పెండింగ్ ఫైల్ క్లియర్ చేయాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్ / కొల్లాపూర్ రూరల్, జూలై 6: కొల్లాపూర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్తో పాటు కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, అటవీ శాఖ అధికారులతో సమావేశమై ఫైళ్ల పెండి్ంప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ స్థాయిలో పరిష్కరించగల ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం తదితర ప్రాంతాలకు సంబంధించిన పోడు పట్టాలు, రెవెన్యూఅటవీ భూ వివాదాలు, జాయింట్ సర్వేలు, భూ రికార్డుల సవరణ సహా 16 అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ స్థాయిలో నిర్ణయం అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని, ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచితే సహించబోమని అధికారులను మంత్రి హెచ్చరించారు.






