15 July, 2026 | 2:31 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

పీఠముడులు వీడేది నేడే!

16-02-2026 01:22 AM
  1. మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలకు ఎన్నికలు

వార్డు, డివిజన్ల విజేతలతో ఉదయం 11గంటలకు ప్రమాణం 

ఆ తర్వాత చేతులు ఎత్తే విధానం ద్వారా చైర్మన్, మేయర్ ఎన్నిక 

సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతి

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 116 మున్సిపాలి టీలు, ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సోమవారం ఎన్నిక జరగనుంది. ముందుగా కొత్తగా ఎన్నికైన 116 మున్సిపాలిటీలకు చెందిన 2,594 మంది కౌన్సిలర్లు,  ఏడు కార్పొరేషన్లకు గాను 414 మంది కార్పొరేటర్లు  ఉద యం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్, వైఎస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలర్స్, కార్పొరేటర్లు చేయి ఎత్తే విధానం ద్వారానే చైర్మన్, మేయర్  ఎన్నిక జరగనుంది. ఒక వేళ  చైర్మన్, మేయర్ల ఎన్నిక నిర్వహించడానికి కౌన్సిలర్స్, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒక వేళ కోరం లేకపోతే చైర్మన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. 

ఆ తర్వాత రోజు కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌కు పోటీ లేకుండా ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు కూడా ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజక వర్గ పరిధిలో ఏ మున్సిపాలిటీలోనైనా ఓటు వేసే అవకాశం ఉంది.

ఇక ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మాత్రం తనకు ఓటు హక్కు ఉన్న నియోజక వర్గంలోనే ఎక్స్‌ఆఫీషియోగా ఓటు వేయాల్సి ఉంటుంది. పోటీకి ఉన్న ఇరువురికి సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మున్సిపల్, కార్పొరేషన్లలో గెలిచిన అభ్యర్థులను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. గెలిచిన అభ్యర్థులను క్యాంపుల నుంచి నేరుగా ప్రమాణస్వీకారానికి తీసుకురానున్నారు.