16-02-2026 01:21:03 AM
మూడోసారి వార్డు కౌన్సిలర్‌గా సోమయ్య
మహబూబాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరసగా మూడోసారి సీపీ ఎం నుంచి వార్డు కౌన్సిలర్‌గా సూర్ణపు సోమయ్య ఎన్నికై ఓటమి ఎరుగని ఎర్రన్నగా పేరు గడించాడు. మానుకోట మున్సిపల్ కౌన్సిలర్‌గానే కాకుండా 1995 నుంచి ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ప్రతిసారి విజయం సాధించడం మరో విశేషం.
1995 లో ఎంపీటీసీగా, తర్వాత మహబూబాబాద్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ఎన్నికై సీపీఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిం చారు. తాజాగా మూడోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో 29వ వార్డు కౌన్సిలర్‌గా మరోసారి ఎన్నికయ్యారు.