22 May, 2026 | 7:42 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షం

15-01-2026 12:39 AM

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫైర్ 

రామాయంపేట, జనవరి 14 :రామాయంపేట మున్సిపాలిటీలో కోట్లలో అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. అక్రమాలపై ప్రతిపక్షం తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. బుధవారం టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు నేతృత్వంలో పార్టీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని ఇష్టారాజ్యంగా విమర్శించడం సరైనది కాదన్నారు. ఏదైనా అవినీతి జరిగినట్లు రుజువు చూపితే సదరు కమిషనర్ పై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అంతేగానీ  అనవసరపు ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతలకు తగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, చింతల స్వామి,దేమే యాదగిరి,దేవుని రాజు, పోచమ్మల అశ్విని లు ఉన్నారు.