ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కోహ్లీ భారీ రికార్డు.. వరుసగా 4 సీజన్లలో 600 రన్స్
ధర్మశాల, మే 26 : రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్ల పాటు 600 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్‌లో 600 పరుగుల మార్క్‌ను అం దుకున్నాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా 4 సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి ఘనత సాధించాడు. 2023, 2024, 2025 సీజన్లలోనూ విరాట్ 600కుపైగా రన్స్ చేశాడు. ఇప్పడు ఈ ఏడాది సీజన్‌లో కూడా కోహ్లి 50.00 సగటుతో 600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు.






