26 May, 2026 | 1:54 AM

ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోలేదు!

26-05-2026 12:00 AM
  1. నీట్ యూజీ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
  2. ఎన్టీఏ, కేంద్రం, సీబీఐకి నోటీసులు
  3. ఈ నెల 29న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, మే 25: ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గుణపాఠం నేర్చుకోకపోవడం విచారక రమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. నీట్ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నీట్ లీక్ వ్యవహారం, వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో ఒక పటిష్టమైన, స్వ యంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం, ఎన్టీఏ, సీబీఐకి నోటీసులు జారీచేసింది.

ఈ నెల 28 లోగా 2024లో కోర్టు ఆదేశాలు పా టించడంపై అఫిడవిట్ దాఖలు చేయాల ని ఎన్టీఏను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతకు ముందు 2024లోనూ నీట్ పేపర్ లీకైంది. దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏకు బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చే యా లని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవా రం విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఎన్టీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్‌లు పీఎస్ నరసిం హ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం, పిటిషన్ల కాపీని ఇతర పార్టీలతో పాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కూడా అందజేయాలని ఆదేశించింది.

అలాగే, నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యత వహించే ఎన్టీఏని, 2024లో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పా టించడంపై గురువారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ‘వారు గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరం. ఈ విషయం గతంలో కూడా ఈ కోర్టుకు వచ్చింది. అప్పుడు ఒక కమిటీ, ఒక పర్యవేక్షణ కమిటీ ఉండేది. అది కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని ఆమోదించడం జరిగింది.

కమిటీ సూచించిన సిఫార్సులను పాటించడానికి తీసుకున్న చర్యలపై ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు చేయాలని మేం కోరుకుంటున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది. న్యాయవాది తన్వి దుబే ద్వారా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండి యా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) దాఖ లు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఇలాంటి అన్ని కేసులను కలిపి విచారిస్తున్నట్లు తెలిపింది.