21 July, 2026 | 9:04 PM

నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా పురుషోత్తం

21-07-2026 06:11 PM

కుబీర్,(విజయక్రాంతి): నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూవ్మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూవ్మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కసిరే పురుషోత్తం మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధమైన న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తానన్నారు.

కుల, మత, వర్గ భేదాలు లేకుండా అణగారిన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికీ చట్టం ముందు సమాన న్యాయం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ మందానీ, రాష్ట్ర కార్యదర్శి అక్బర్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గుడాల శేఖర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంస్థ బలోపేతం కోసం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టి మానవ హక్కుల పరిరక్షణలో చురుకుగా పనిచేస్తామని పేర్కొన్నారు