ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నంకు రాష్ట్ర మంత్రి హోదా
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతకుంట విజయ రమణ రావు, వేముల వీరేశం లకు రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తూ G.O.Rt.No.1064 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ విప్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం పట్ల మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్‌లోని ఆర్టికల్–18 ప్రకారం రాష్ట్ర మంత్రి హోదాకు సంబంధించిన అన్ని అధికారిక ప్రోటోకాల్‌లు, మర్యాదలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి వర్తించనున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, శాసనసభలో ప్రభుత్వ తరఫున సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం ఆయన సేవలకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నారు.






