27 February, 2026 | 1:05 AM

హెల్త్ కేర్ ట్రస్టు పేరు మార్చాలి

26-02-2026 12:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నగదు రహిత వైద్యాన్ని అందించే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరులో స్వల్ప మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ట్రస్టు ఉద్యోగులు, పెన్షనర్లకు ఉద్దేశించింది కావడంతో స్వల్ప మార్పుతో ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ హెల్త్ కేర్ ట్రస్ట్‌గా మార్చాలని కోరారు.