calender_icon.png 5 February, 2026 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

05-02-2026 12:00:00 AM

రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జగిత్యాల, ఫిబ్రవరి 4 ( విజయక్రాంతి ) : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిం ది. ఇందులో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ బుధవారం జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు సమక్షంలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో ఈ రాండమైజేషన్ చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎ న్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపా రు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, జిల్లా నోడల్ అధి కారి కె. రాము, కలెక్టరేట్ ఏవో హకిమ్, ఈడిఏం మమత, అధికారులు పాల్గొన్నారు.