మైనారిటీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలి
ముస్లింల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో కేవలం 40 శాతం నిధుల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం
ఆలిండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్
ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో కేవలం 40 శాతం నిధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆలిండి యా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ నేతలు ఆరోపించారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా ముస్లిం మైనారిటీ సప్లైన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో ముస్లింల కోసం మైనారిటీ సబ్స్టేన్ అమలు చేసిందని వారు గుర్తు చేశారు.
మంగళవారం హైదరూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ అజీజాపాషా, అలిండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్తార్ హుస్సేన్, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ సభ్యులు ఎం.ఎ.సిద్ధిఖి తదితరులు మాట్లాడారు.
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 4 శాతం కేటాయించిన రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ వర్గం అభ్యున్నతికి 6 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ముస్లిం యువతకు రుణాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. అప్పట్లో వెనుకబడిన పేద ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం రంగనాథ్ మిశ్రా కమిషన్ సచార్ కమిటీలు పలు నివేదికలు పాలకులకు సిఫారసులు చేస్తే నేటీ వరకు వాటి అమలుపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని అరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సికిందర్, దస్తగిరి పాల్గొన్నారు.






