28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

రెండుసార్లు మరణించిన వ్యక్తి!

30-04-2026 02:44 AM
  1. వేర్వేరు తేదీల్లో రెండు డెత్ సర్టిఫికెట్లు
  2. జారీ చేసిన అధికారులు
  3. తప్పుడు పత్రాల జారీపై సర్వత్రా విమర్శలు

చందుర్తి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): మరణించిన ఒక వ్యక్తికి సంబంధిత అధికారులు వేర్వేరు తేదీల్లో రెండుసార్లు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి లింగయ్య అనే వ్యక్తికి 2022 మే 5న డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే అదే వ్యక్తి పేరుపై వైద్య ఆరోగ్య శాఖ మరోసారి 5 జూన్ 2024న మరో డెత్ సర్టిఫికెట్ జనవరి 1, 2024న మరణించినట్లు మరోసారి జారీ చేశారు. ఒకే వ్యక్తి రెండుసార్లు మరణించినట్లు తప్పుడు పత్రాలను జారీ చేయడమేమిటని అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు పత్రాలపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నారు.