మకుటం వచ్చేది అప్పుడే
06-08-2026 12:03 AM
సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్‌పై విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. దివంగత ఆర్‌బీ చౌదరి నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జాన్ విజయ్, జయప్రకాశ్, అజయ్, వంశీకృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న రిలీజ్ చేయబోతోన్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్, అభినందన్ రామానుజం; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఆర్ట్: జీ దురైరాజ్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్.






