డార్క్ కామెడీ యాక్షన్ మిషన్ పాజిబుల్
నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ రూపొందించిన తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మూదర్ కూడమ్’. 2013లో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మూదర్ కూడమ్ 2’ రూపొందుతోంది. ‘మిషన్ పాజిబుల్‘ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. నవీన్ హిదయత్, ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ హిదయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రాండెల్ పిక్చర్స్ బ్యానర్‌పై సంకిత్ బోరా, కమల్ బోరా నిర్మిస్తున్నారు.
బుధవారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ నగరంలో డైనోసార్స్ భీభత్సం సృష్టి స్తుండటం.. వాటిని తరిమేందుకు ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగడం.. శాంటాక్లాజ్ డ్రెస్‌లో ఉన్న ఒక బొమ్మను ఫాలో అవుతూ మూవీలోని ప్రధాన పాత్రధారులు పరుగెత్తుతు న్నట్టు ఉన్న ఈ పోస్టర్ భారీ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తలపిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబో తున్నారు. వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ సూపర్‌వైజర్‌గా కేఏ బట్చా పనిచేస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సూరజ్ నల్లుసామి; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: నటరాజన్ శంకరన్; మ్యూజిక్ (సాంగ్స్): అమ్రిషన్, నటరాజన్ శంకరన్; ఎడిటర్: అతియప్పన్ శివ.






