calender_icon.png 22 February, 2026 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద హాస్పిటల్స్‌లో ‘డెక్కన్ హెమటోలింక్ 3.0’

22-02-2026 12:58:02 AM

హెమటాలజీ వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భాగస్వామ్యంపై అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు 

రెండు రోజుల పాటు సదస్సు నిర్వహణ 

హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): డెక్క న్ హెమటోలింక్ 3.0 ఇది బ్లడ్ క్యాన్సర్ నిర్దారణ, చికిత్స, పేషెంట్ కేర్‌లో వచ్చిన తాజా పురోగతులపై చర్చించడానికి 700 మందికిపైగా జాతీయ, 10 మందికిపైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో-ఆంకాలజీ వైద్య నిపుణులతో బ్లడ్ క్యాన్సర్స్ నిర్దారణ, చికిత్సలో అందుబాటులోకి వచ్చిన ఏఐసాంకేతిక పురోగతులపై అతిపెద్ద అంతర్జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేశారు.

శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా, యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడడం అంటే కేవలం వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, దీనికి మా నసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరమన్నారు.భారతదేశంలో క్యాన్సర్ భా రం క్రమంగా పెరుగుతోందన్నారు.

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ప్రకారం లుకేమియా, లింఫోమా అండ్ మైలోమా ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రాలలో వాటి ప్రాబల్యం కొంచం ఎక్కువనే చెప్తున్నాయి. క్యాన్సర్లు.. ఇటు రోగులకు, అటు వైద్య నిపుణులకు ఒకే విధంగా ముఖ్యమైన సవాళ్లను విసురుతున్నాయి. అయినప్పటికీ, క్యాన్సర్ ని ర్దారణ, చికిత్సలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతిక పురోగతులు, ఎముక మజ్జ మార్పిడి నుండి సీఏఆర్‌టీ సెల్ థెరపీ వంటి అత్యాధునిక ఇమ్యునోథెరపీల వరకు క్యాన్సర్ చికిత్సలో వచ్చిన విప్లవాత్మక మార్పులు క్యాన్సర్ రోగులకు కొత్త ఆశలను అందిస్తున్నాయని డాక్టర్ జీఎస్ రావు తెలిపా రు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ హెమటాలజిస్ట్, డాక్టర్.గణేష్‌జైషెట్వార్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్, గత 13 సంవత్సరాలుగా 600 కి పైగా విజయవంతమైన ఎముక మజ్జ మార్పిడిని, వేలాది మంది రక్త క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించి వారికి కొత్త జీవితాన్ని అందించినట్లు సగర్వంగా ప్రకటించారు.

సాంప్రదాయ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇప్పటివరకు చాలా మంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు పరిమిత చికిత్స ఎంపికలు ఉండేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ‘టార్గెటెడ్ థెరపీలు, ‘సీఏఆర్‌టీ సెల్ థెరపీ, ‘జన్యు చికిత్స వంటి అత్యాధు నిక ప్రపంచస్థాయి చికిత్స విధనాలు హెమటోలాజిక్ కేర్ యొక్క స్వరూపాన్నేమార్చివేశాయన్నారు. ఇప్పు డు బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతన, ఆశాజనకమైన చికిత్స సీఏఆర్‌టగీ సెల్ థెరపీ. ఇది క్యాన్సర్‌పై దాడి చేయడానికి రోగి రోగనిరోధక కణాలను పునరుత్పత్తి చేస్తుంది.