‘కబ్జాల’ బిల్డర్!
- ఆయన కట్టినవన్నీ అక్రమ నిర్మాణాలే..
- ఒక్కప్పుడు కారు మెకానిక్.. ఇప్పుడు బిల్డర్
- సామ్రాజ్యాన్నే సృష్టించిన బిల్డర్ సాజిద్ ఖాన్
- అంజయ్యనగర్ బిల్డింగ్ ఘటనలో విస్తుపోయే నిజాలు
- సొంత స్థలం 38 గజాలే.. మరో 10 గజాలు నాలా ఆక్రమణ
- రాయదుర్గం పీఎస్‌లో కేసు.. సాజిద్‌ఖాన్ అరెస్ట్
- సీఎంసీ మాదాపూర్ టీపీబీఓ సంతోష్‌కుమార్ సస్పెన్షన్
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (విజయక్రాం తి): భూ కబ్జాలకు ప్పాల్పడుతూ.. స్థానికంగా భయభ్రాంతులకు గురిచేస్తూ.. నయానో.. బయానో.. ఇళ్ల స్థలాలను కొన్ని, బిల్డింగ్‌లు నిర్మిస్తూ.. అమ్ముతూ.. సాజిద్‌ఖాన్ బిల్డర్ అవతారం ఎత్తినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కప్పుడు కారు మెకానిక్ అయి న సాజిద్ ఇప్పుడు బిల్డర్ అవతారంతో కోట్ల కు పడగలెత్తినట్లు విమర్శలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండ దండలతో.. యంత్రాంగానికి మామూళ్ల కట్టలతో కట్టడి చేసుకుని యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ..
పునాదులు, ఇంజినీరింగ్ ప్రణాళిక లకు, నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ.. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూ.. సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నట్లు తెలుస్తుంది. ఆయన కట్టిన వన్నీ అక్రమ నిర్మాణాలేనని విచారణలో అధికారులు తేల్చారు. మరోపక్క అంజయ్యనగర్ బిల్డింగ్ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలు గు చూస్తున్నాయి. సొంత స్థలం 38 గజాలే.. అయితే. మరో 10 గజాలు నాలాను ఆక్రమి ంచి, మొత్తం 48 గజాల్లోనే ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తేలింది. బిల్గింగ్ కూలి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటనతో సాజిద్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసి, ఆదివారం సాజిద్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అలాగే సీఎంసీ మాదాపూర్ టీపీబీఓ సంతోష్‌కుమార్‌ను సస్పెండ్ చేశా రు. గతంలో తండ్రి వద్ద కారు మెకానిక్‌గా పనిచేసిన సాజిద్, గత 4 ఏళ్లుగా స్థానిక ప్ర జాప్రతినిధులు, అధికారుల సహకారంతో భూ ఆక్రమణలకు పాల్పడడం ప్రారంభించినట్లు సమాచారం. కబ్జాదారులతో చేతులు కలిపి పేద, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, వారి ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు లాక్కునేవాడని ఆరోపణలు వస్తున్నా యి.
ఆపై ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్స్ నిర్మించి, అమ్మేయడం అతనికి అలవాటుగా మారిందని తెలుస్తోంది. గత మూ డేళ్లలోనే 5 బిల్డింగ్స్ నిర్మించిన బిల్డర్ సాజి ద్, అధికారులకు లంచాలు మళ్లించడంతో వారు ఇతని అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శలు వస్తున్నా యి. ప్రభుత్వ స్థలాలను, కాలనీ పార్కును కూడా ఆక్రమించి 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తూ సాజిద్‌ఖాన్ రూ.కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నా ణ్యతా ప్రమాణాలు పాటించకుండా హాస్టళ్లు, నివాస భవనాలు కడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అంజయ్యన గర్‌లో బిల్గింగ్ కూలి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటనతో సాజిద్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాజిద్ ఖాన్‌కు సహకరిస్తున్నది ఎవరు? ఎవరెవరితో కలిసి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడతున్నాడనే దానిపై హైడ్రా, పోలీసులు విచారణ చేపట్టారు.
సొంత స్థలం కేవలం 38 గజాలే..
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో జరిగిన ఘటనలో సొంత స్థలం కేవలం 38 గజాలు మాత్రమే దానికి మరో 10 గజాల నాలాను ఆక్రమించి, మొత్తం 48 గజాల పరిధిలోనే ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు సాజిద్ ఖాన్. సరైన పునాదులు, ఇంజినీరింగ్ ప్రణాళికలు లేకుండా నిర్మిస్తున్న 7 అంతస్తుల బిల్డింగ్ శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దా రుణానికి బాధ్యుడైన బిల్డర్ సయ్యద్ సాజిద్ కట్టినవన్నీ అక్రమ నిర్మాణాలేనని విచారణలో తెలుస్తోంది.
ఒకవైపు బిల్డింగ్ నేల మట్టమై ప్రాణనష్టం జరగగా, అదే ప్రాం తంలో తాను నిర్మిస్తున్న మరొక అక్రమ భవనానికి ఆరో అంతస్తు స్లాబ్ పనులు చేయి స్తూ బిల్డర్ సాజిద్ నిశ్చింతగా ఉన్నాడని అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రతను తెలుసుకున్న వెంటనే అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ రాయదుర్గం పోలీసులు సాజిద్‌ను కచ్చితమైన సమాచారంతో గాలించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
రాయదుర్గం పీఎస్‌లో కేసు.. నిందితుడి అరెస్ట్
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ టౌన్ ప్లానింగ్ విభా గం అధికారి సంతోష్‌కుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, బిల్డర్ సయ్యద్ సాజిద్‌ఖాన్‌పై 105 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వర్షంలో సైతం ప్రమాద స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఆ బిల్డింగ్ కూలిన సమయంలో శిథిలాలు పడటంతో పక్కను న్న అపార్ట్మెంట్‌లోని 10 ఫ్లాట్స్ దెబ్బతిన్నాయి.
దీంతో ప్రమాదకరంగా మారిన దాన్ని కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు ముమ్మరం చేశారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని హైడ్రా కమిష నర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఘటనతోనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి వీటికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు చేపడతారని ప్రజలు ఆశి స్తున్నారు. అదే సమయంలో మరోమారు ఇలాంటి ప్రమాదపూరిత ఘటనలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.






