16 April, 2026 | 4:01 AM

రైల్వే ఆర్‌ఓబీ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

16-04-2026 12:16 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

జనగామ, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) పెంబర్తిలో నిర్మించనున్న ఆర్‌ఓబీ కింద భూ సేకరణ ప్రక్రియ, ఇసుక తరలింపుపై బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైల్వే, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్ అ ండర్ బ్రిడ్జ్ (లేదా) రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గాను క్షేత్రస్థాయిలో ఉన్న అవకాశాలను గుర్తించి, సమన్వయంతో తనిఖీలు చేపట్టి, నివేదికను సమర్పించాలని అదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో గోపీరామ్, రైల్వే అధికారులు శేషా చారి, సామ్రాట్ రాయ్, ఆర్ అండ్ బి ఈఈ సరితా రాణి, జి సెక్షన్ సూపరింటెండెంట్ చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.