మెదక్ పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రూ.37.01 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్, మే 7(విజయక్రాంతి) : పట్టణ ప్రాంత అవసరాలను గుర్తించి వారికి మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలోని ఆయా వార్డుల్లో రూ.37.01 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్ శంకుస్థాపన చేశారు. TUFIౄC, SBM పథకాల కింద మెదక్ పట్టణంలో 37.01 కోట్ల రూపాయల వ్యయంతో మెదక్ మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, స్లాబ్ల నిర్మాణంకు పనులను శంఖుస్థాపన చేశారు.
వార్డు నెం. 1-ఔరంగాబాద్ ప్రాంతం BC కమ్యూనిటీ హాల్ సమీపంలో CC డ్రెయిన్లు, స్లాబ్లు, రోడ్ల నిర్మాణంకు రూ.36 లక్షలు, వార్డు నెం. 2-అవుసులపల్లి మాధురి దేవయ్య ఇంటి సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణం రూ.32 లక్షలు, వార్డు నెం. 3లో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.30 లక్షలు, వార్డ్ నెం. 5-మిలిటరీ కాలనీ, జంబికుంట, ఇందిరాపురి కాలనీలు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో అభివృద్ధి పనులు రూ.76 లక్షలు, వార్డు నెం 19- చర్చి ప్రాంతం 100 మంది సభ్యుల కోసం G+3 వసతి గృహ నిర్మాణంకు రూ.14.77 లక్షలు, వార్డు నెం. 6 అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డుపై సీసీ రోడ్ల నిర్మాణంకు రూ.39.50 లక్షలు, వార్డు నెం. 7 ఖుత్బిష్లాం మసీదు రోడ్డుకు సమీపంలో, వాటర్ ప్లాంట్ దగ్గర సీసీ రోడ్ల నిర్మాణం రూ.35 లక్షలు, వార్డు నెం. 28 కమ్యూనికాంత ఫోర్ట్ రోడ్డులో సిసి డ్రైనేజీలు మరియు రోడ్ల నిర్మాణం రూ.30 లక్షలు, వార్డు నెం. 14- నవాపేట ప్రాంతంలో అభివృద్ధి పనులు రూ.30 లక్షలు, వార్డు నెం. 12 2BHK ప్రెస్ కాలనీ ప్రధాన రహదారి ప్రవేశద్వారం వద్ద CC డ్రెయిన్లు, స్లాబులు మరియు రోడ్ల నిర్మాణం రూ.160 లక్షలు, వార్డు నెం. 13లో రూ.15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మొత్తం రూ.37.01 కోట్ల రూపాయల విలువైన మొత్తం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ ప్రాంత ప్రజల అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నిధులు మంజూరు చేస్తూ పనులు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






