4 July, 2026 | 2:52 PM

జిమ్‌లలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు.. ఆరుగురు అరెస్టు

04-07-2026 02:17 PM

హైదరాబాద్: స్టెరాయిడ్ ఇంజెక్షన్లు(Steroid injections) విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు జిమ్ లలో కసరత్తు చేసే వారికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. ఈ కామర్స్ వెబ్ సైట్ల నుంచి నిందితులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని డీసీపీ వైభవ్ గైక్వాడ్(DCP Vaibhav Gaikwad) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వైద్యుల అనుమతి లేనిదే ఇలాంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని డీసీపీ హెచ్చరించారు. కొందరు ఫేక్ మందుల చీటి ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడితే దీర్ఘకాలంలో మానసిక సమస్యలు వస్తాయని సూచించారు.