ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 26: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం,కొమ్మాల గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర భారత దేశంలో ప్రతి పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పేదవారికి అందేలా చూస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చార్యులు, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్ జలంధర్,సర్పంచ్ లు కర్నాటి వెంకన్న,కుంటిగొర్ల శ్రీనివాస్,చిల్లంచర్ల విద్యాసాగర్,
బింగి కృష్ణమూర్తి,మంచాల లలితారామ్మూర్తి,పాశం కరుణభాస్కర్ రెడ్డి,చెరుకు వెంకటమ్మ, లూనావత్ కృష్ణ, తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ పల్లపు ఝాన్సీ, పంచాయతీరాజ్ ఏఈ కుమారస్వామి,మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్, ఆర్‌ఐ జలంధర్ రావు,వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




