23 June, 2026 | 1:36 AM

157వ సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలి

23-06-2026 12:19 AM

ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీఎన్ శ్రీధర్ శ్రీనివాస్

సికింద్రాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తిరుమలగిరి మండల పరిధిలోని 157 వ సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్ పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి రెవెన్యూ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్న అట్టి భూమిని ప్రభుత్వం కాపాడాలని ఆయన అన్నారు ముమ్మాటికి అది ప్రభుత్వ భూమేనని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని తమకు ఆదేశించారని, అట్టి స్థలం ప్రభుత్వ భూమేనని, భూకబ్జాదారులపై ప్రభుత్వం అధికారులు చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వమైన ఫిర్యాదు పత్రాన్ని  తమకు ఇవ్వగా అట్టి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేసి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్,టిఆర్‌ఎస్ పార్టీ రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ , దేవరాజ్ పాల్గొన్నారు.