23 June, 2026 | 1:34 AM

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు

23-06-2026 12:18 AM

వనపర్తి, జూన్ 22 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.సోమవారం నాగవరం శివారులోని కేంద్ర విద్యాలయం, మర్రికుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో తరగతి గదులు, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

కేజీబీవీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన రూ.9 లక్షల డిజిటల్ తరగతి గదిని పరిశీలించి త్వరగా ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 16 డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సమయానికి అందేలా చూడాలని, డిజిటల్ విద్యా వేదికలను వినియోగించి విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు.