9 May, 2026 | 10:35 AM

Breaking News

నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •  

మహిళల అభివృద్ధి సంఘ బంధాల లక్ష్యం

09-02-2026 12:00 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 8 : మహిళల అభివృద్ధి కోసం సంఘ బంధాలు లక్ష్యంగా పనిచేయాలని మంగాపురం గ్రామ సర్పంచ్ బత్తిని అంజయ్య గౌడ్ అన్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో ఉపాధి ఆమె పథకం కింద మంజూరైన 10 లక్షలతో నిర్మిస్తున్న సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులను ఆదివారం అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమ భావన సంఘాలలో ఉన్న మహిళలు సమావేశాలు నిర్వహించేందుకు నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,ఏపీవో సురేష్, మాజీ ఎంపీటీసీ బాల్ దూరి సందీప్,పంచాయతీ కార్యదర్శి సుమిత్ర,ఉపసర్పంచ్ ధరావత్ భాషా,గ్రామ శాఖ అధ్యక్షుడు పేరబోయిన వెంకటేశ్వర్లు,గ్రామ పెద్దలు ఎల్లావుల లింగయ్య,యలమంచయ్య,ఫీల్ అసిస్టెంట్లు, వివో ఏ శశికళ మరియు వార్డు నెంబర్లు పాల్గొన్నారు