19 May, 2026 | 2:42 AM

డ్రైనేజీని సైతం వదలని కబ్జాకోరులు..

19-05-2026 12:12 AM
  1. మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన స్థలo సైతం కబ్జా...
  2. కబ్జా కోరల్లో కాలువ కట్ట నిద్రవస్తలో నగరపాలక సంస్థ..

కొత్తగూడెం, మే 18,(విజయక్రాంతి ):  కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం పట్టణం, నగరపాలక సంస్థలోని 7 నెంబర్ బజార్, పొలిమేలను ఆనుకొని ఉన్న కాలువ కట్టను ఇరువైపుల కొందరు స్థానికులు కబ్జాకు తెర లేపారు.  గత ప్రభుత్వ హయాంలో ఈ కాలువ కట్ట అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. పూర్తిగా మురుగునీటితో దుర్గంధం వెదజల్లే ప్రాంతం కావడంతో బస్తీ వాసులు అనారోగ్య పాలవుతున్నారన్న సదుద్దేశంతో  అభివృద్ధికి మాజీఎమ్మెల్యే  వనమా శంకుస్థాపన చేసి పనిని పూర్తి చేశారు.

ఇదే అదునుగా కబ్జాదారులు  కాలువ సైడ్ ఒడ్డును ఆసరా ఆ స్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకొన్నారు.  శంకుస్థాపన చేసినటువంటి స్థలాన్ని రహదారి లేకుండా గ్రీన్ కర్టెన్స్ తో స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. క్రమంగా నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు కబ్జాదారులు. వివరాల్లోకి వెళితే ఇది విజయవాడ హైవేను ఆనుకుని ఉన్నటువంటి 14 నెంబర్, 7 నెంబర్ బజార్ల సరిహద్దులు. ఈ కాల్వ గట్టును కొంతమంది బడా బాబుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

ముదిరాజ్ భవనాన్ని అనుకొని ఉన్న పార్కు కోసం కేటాయించిన స్థలం, పూర్తిగా మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతోందని  పత్రికల్లో కథనాలు వెలబడ్డాయి. ఆ పార్కు ప్రాంతంలో మట్టి, ఇసుకతో చదును చేస్తున్నటువంటి తరుణంలో కాల్వ డ్రైనేజీ అవతల ఉన్నటు వంటి వ్యక్తులు పూర్తిగా డ్రైనేజీని కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలబడుతున్నాయి.

పార్కు కోసం ఉపయోగించే , మట్టిని సైతం కబ్జా చేసిన స్థలంలో పోసి నిర్మాణాల కు సిద్ధంగా ఉన్నారు. ఇంత పెద్ద తంతు జరుగుతున్న నగరపాలక సంస్థ చూసి చూడనట్టు, అంటీ అంటున్నట్టు ఉండటం వెనుక అంతర్యం ఏమిటోనని గుసగుసలాడుతున్నారు .నగర పాలక సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్  అధికారులు మేలుకోవాలని కబ్జా స్థలాన్ని కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.