16-02-2026 01:08:08 AM
హాజరైన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు, ఎంపీ మల్లు రవి
అచ్చంపేట ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా లింగాల మండలం అప్పాపూర్ నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరపూర్లో చెంచుల ఆరాధ్యదైవమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి చెంచు గిరిజనులు భారీగా తరలివచ్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు హాజరయ్యారు. చెంచు పూజారులు మేళతాళాల నడుమ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, సమ్మక్క సారక్క జాతర తరహాలో ఈ జాతరను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నల్లమల్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు.