calender_icon.png 16 February, 2026 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

16-02-2026 01:09:26 AM

అలంపూర్, ఫిబ్రవరి 15: ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు ఆదివారం దర్శించుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ఉభయ ఆలయాలను దర్శించుకుని స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు,అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే .. ప్రజలకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో భక్తి భావంతో మెలగాలని ఆకాంక్షించారు.వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.ఆయన వెంట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పుల్లూరు నాగేశ్వర్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.