18 April, 2026 | 8:18 AM

గేమ్ పూర్తయింది!

18-04-2026 12:00 AM

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజాచిత్రం ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కథను షాబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ సంయుక్తంగా రచించారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు టీమ్ అధికారిక ప్రకటన వెల్లడించింది. 11 నెలల కాలంలో సుమారు 156 రోజుల పాటు దక్షిణాదిన ఉన్న 100కి పైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపినట్టు టీమ్ తెలిపింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన స్టైలిష్‌గా, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, తమిళ -దర్శక నటుడు మిష్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్; సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్; సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్; ఎడిటింగ్: చమన్ చాకో; ప్రొడక్షన్ డిజైన్: అజయన్ చలిసేరి.