రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ రసాభాస
కాంగ్రెస్, బిజెపి నాయకుల తోపులాట
రుద్రంగి ఆగష్టు 27(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip and MLA Adi Srinivas) పాల్గొన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రధానమంత్రి మోడి ఫోటో రేషన్ కార్డుపై లేకపోవడంతో బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార రెడ్డి ఫోటో పెట్టి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ బిజెపి నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు పార్టీ నినాదాలు చేస్తూ తోసుకున్నరు. పోలీసులు కలుగచేసుకొని ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పారు.






